చెల్లని రూపాయి, డాలర్.. అవసరమా.?

ktr speach

తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తన వాక్చాతుర్యంతో వరంగల్ ఓటర్లను, కార్మికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జయశంకర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం వరంగల్ లోని తారాగార్డెన్ లో నిర్వహించారు. దీనికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కడియం, పసునూరి దయాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడని విమర్శించారు. చెల్లని రూపాయి నోటును చూపిస్తూ ఇది హైదరాబాద్ లో చెల్లలేదని.. వరంగల్ లో ఎలా చెల్లుతుందని సర్వేను గురించి ప్రశ్నించారు. ఇక బీజేపీ అభ్యర్థి దేవయ్య .. అమెరికాలోని డాలర్లలో బతికాడని.. డాలర్ కూడా వరంగల్ లో చెల్లదని..వారికి ప్రజా సమస్యలు, ఇక్కడి స్థానికుల అవసరాలు తెలియవని విమర్శించారు.

వరంగల్ టీఆర్ఎస్ తరపున నిలబడ్డ దయాకర్ మన రూపాయి లాంటివాడని.. ఆయన్ను అందరూ గెలిపించాలని కోరారు. కేసీఆర్ చిరిగిన రూపాయి చూపిస్తూ వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *