చెర్రీతో రేసుగుర్రం డైరెక్టర్ సినిమా

హైదరాబాద్, ప్రతినిధి : గోవిందుడు అందరివాడేలే  ఆవరేజ్ హిట్ తర్వాత డైరెక్టర్స్ విషయంలో నిక్కచ్చిగా ఉండాలని నిర్ణయించుకున్న రామ్‌చరణ్ కొత్త సినిమా శ్రీను వైట్ల డైరెక్షన్లో జనవరిలో సెట్స్‌పైకి వెళ్తోంది. ఈ మూవీతోపాటు మరో డైరెక్టర్‌కు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. 2014 బ్లాక్‌బస్టర్ ‘రేసుగుర్రం’తో బన్నీని రూ.50 కోట్ల క్లబ్‌లో చేర్చిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైన్‌ను చెర్రీకి వినిపించి ఓకే చేయించుకున్నాడనేది న్యూ ఇయర్ న్యూస్.

ప్రస్తుతం ‘కిక్ -2’ను డైరెక్ట్ చేస్తున్న సురేందర్.. ఈ మూవీ కంప్లీట్ కాగానే చెర్రీ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్తాడని అంటున్నారు. హీరోలను స్టైలిష్‌గా ప్రజెంట్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన సురేందర్‌కి కామెడీ పైనా మాంఛి కమాండ్ ఉంది. చెర్రీని సరికొత్తగా ప్రజెంట్ చేసే ఈ మూవీ 2016 సంక్రాతికి రిలీజ్ ఉండొచ్చని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.