Breaking News

చెన్నై వరద సహాయార్ధం మైత్రీ మూవీ మేకర్స్ 5 లక్షల సాయం

NTR-Koratala-Siva-Mythri-Movies-Launch-Photos-12
ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ చెన్నై వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ సంస్థ అధికారికం గా తెలిపారు.
“చెన్నై మహానగరం తో మా మైత్రీ మూవీస్ టీం కి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. అటువంటి చెన్నై ఇవాళ నీట మునగటం బాధాకరం. మైత్రీ మూవీస్ తరపున 5 లక్షల సహాయాన్ని తమిళ్ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాము. చెన్నై ప్రజలకు మనం అండగా ఉండాల్సిన సమయం ఇది”, అని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం) తెలిపారు.
 తమిళ్ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం) ఈ చెక్ ను అందిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *