చెదరని జ్ఞాపకం..

-నేడు ఫొటోగ్రఫీ దినోత్సవం

కరిగిపోయిన కాలాన్ని.. ఎన్నోడో జరిగిన సంఘటనలను కళ్లముందు సాక్షాత్కరింపజేసేవి ఫొటోలు.. వెయ్యి మాటలతో రాని భావాన్ని ఒక్క ఫొటో తెలియజేస్తుంది.. మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిల పరిచే చాయచిత్రాలు.. మన రూపాలకు ప్రతిరూపం.. మన హావభావాలకు నిలువెత్తు నిదర్శనం.. ఇలా మధురమైన తీపి జ్ఞాపకాలను పదిల పరిచి మన జీవితాల్లో విడదీయరాని బంధమైనవి ఫొటోలు.. కోటి భావాలకు రూపం.. చరిత్రకు ఆధారం.. మధురమైన భావం.. మరువని బంధం.. ప్రకృతి అందం.. అందరికీ నేస్తం.. మనిషి జీవితంలో తిరిగిరాని కాలాన్ని మధురమైన జ్ఞాపకాలను శాశ్వతంగా బందించేదే ఫొటోగ్రఫీ.. నేడు ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా దేశవిదేశాల్లో అందరూ ఫొటో గ్రాఫర్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఫొటో గ్రఫీకి జీవం పోసింది లూయిస్ డగ్యరి.. ఫొటో గ్రఫీకి మొదటి సృష్టికర్తగా లూయిస్ చరిత్రలో నిలిచిపోయారు. 1829లో జోసఫ్ నైస్ ఫోర్ తో భాగస్వామ్యాన్ని ఎర్పరుచుకున్నాడు. లూయిస్ 1850 నాటికి న్యూయార్క్ లో మొదటి ఫొటో స్టూడియోను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వివిధ రూపాలుగా అభివృద్ధి చెంది నేటి ఫొటో పెద్దది అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.