
హైదరాబాద్ నగరంలో చెత్త సేకరణకు ఉపయోగించే ఆటో ట్రాలీ డిజైన్లను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆమోదించారు. గతంలో ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు డిజైన్లలో రంగులు మార్చి జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్కుమార్ వాహనాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపించారు. వాటిని సిఎం ఆమోదించారు. ఇండ్లకు సరఫరా చేసే బ్లూ, గ్రీన్ ప్లాస్టిక్ చెత్త బుట్టలను కూడా ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు.