Breaking News

‘చెత్త’ కార్మికుల చింత తీర్చలేరా..?

GARBAGE_0_0

స్వచ్ఛ హైదరాబాద్ తో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న హైదరాబాద్ పారిశుధ్య వ్యవస్థ ఇఫ్పుడు మున్సిపల్ కార్మికుల సమ్మెతో అటకెక్కింది… కార్మికులు తమ సమస్యలు తీర్చాలని, జీతాలు పెంచాలని 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల సమ్మెతో చెత్తా చెదారం రోడ్లపై నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది.. ఈరోజు నుంచి పురపాలిక వీధి దీపాలు.. మంచినీళ్లూ బంద్ చేస్తామని తెలిపారు.

శుక్రవారం కార్మిక సంఘాలతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారి సమ్మె కొనసాగుతోంది. శనివారం నుంచి ఇందిరాపార్క్ వద్ద భారీ సభను , నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *