
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్ కు ఊరట లభించింది. ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.
నీ జతగా నేనుండాలి సినిమా వివాదంలో బండ్ల గణేష్ తనకు డిస్ట్రి బ్యూషన్ డబ్బులు ఇవ్వలేదని ఆ చిత్రం హీరో సచిన్ జోషి గణేష్ చీటింగ్ కేసు పెట్టారు. దీంతో ఈ కేసు విచారణకు బండ్ల ఈరోజు హాజరయ్యారు.