Breaking News

చీప్ ట్రిక్కుల ఆప్

AAP

ఢిల్లీలో ఈసారి గెలవకపోతే దుకాణం బంద్ అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ వారికి తెలుసు. అందుకే, బీజేపీని చికాకు పెట్టడానికి, ప్రజలను అయోమయంలో పడేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని కేజ్రీవాల్ పదే పదే సవాల్ చేస్తున్నారు. ఆమె నో అన్నా వెంట పడుతున్నారు. చర్చ పేరుతో ఈ ఎన్నికలకు సంబందం లేని అంశాలను కూడా ప్రస్తావించి, గందర గోళం చేయాలనేది ఆయన వ్యూహం కావచ్చు.

కేజ్రీవాల్ కు డ్రామా, తమాషా మాత్రమే తెలుసని, తాను మాత్రం పని చేయడానికి వచ్చానని కిరణ్ బేడీ చెప్పారు. సరే, ఒక వేళ చర్చ తప్పనినరి అనుకుంటే, షాజియా ఇల్మీతో కేజ్రీవాల్ చర్చిస్తారా అనే సవాలుకు జవాబు లేదు. ఆప్ పార్టీ నిర్మాణంలో, కీలకమైన కమిటీల్లో ప్రజా స్వామ్యం ఎలా లోపించిందో, ఎప్పుడెప్పుడు ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరెవరు అవమానపడ్డారో షాజియా ఇల్మీ సవివరంగా మీడియా ముందు చెప్పారు. ఈ పరిస్థితులు మారితే తాను పార్టీలో కొనసాగుతానని ఆ మధ్య ప్రకటించారు.

షాజియీ లేవనెత్తిన అంశాలకు ఇప్పటి వరకూ కేజ్రీవాల్ జవాబు ఇవ్వలేదు. పోనీ ఇప్పుడైనా ఆమెతో బహిరంగ చర్చకు రెడీ యా అంటే అదీ లేదు. అంతే కాదు, ఒకప్పటి ఆప్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ కూడా కేజ్రీవాల్ వ్యవహార శైలి లోని లోపాలను ఎత్తి చూపారు. పార్టీలో నిరంకుశత్వం ఎలా పెరిగిందో చెప్పారు. ఆయన లేవెనెత్తిన అంశాలకు కూడా కేజ్రీవాల్ జవాబు చెప్పలేదు. తనకో నీతి, ఇతరులకో నీతి అన్నట్టు వ్యవహరించడం కేజ్రీవాల్ కు అలవాటే. తాను చెప్పినట్టు ఇతర పార్టీల వారు కూడా నడచుకోవాలనే నిరంకుశ వైఖరి వల్లే పార్టీని చాలా వరకు నాశనం చేశారు. ఇప్పుడు కిరణ్ బేడీని చర్చకు పిలవడం ఓ చీప్ గిమ్మిక్కు అనే బీజేపీ విమర్శలో అర్థం ఉందంటున్నారు పరిశీలకులు. ఇలాంటి ట్రిక్కులకు ఓట్లు వస్తాయా అనేది చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *