చివరి ఆయకట్టు వరకు సాగునీరు: రాష్ట్ర్ర ఆర్ధిక మంత్రి

చివరి ఆయకట్టు వరకు సాగునీరు: రాష్ట్ర్ర ఆర్ధిక మంత్రి

కరీంనగర్: జిల్లాలో ఎస్.ఆర్.ఎస్.పి. క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర్ర ఆర్ధిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం పెద్దపల్లి నుండి జమ్మికుంట వరకు ఎస్.ఆర్.ఎస్.పి. కాలువను పరిశీలించారు. ఆయన వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మంధని ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్.ఆర్.ఎస్.పి. ప్రాజెక్టు చేపట్టి 53 సంవత్సరాలు అయినను ఇంకా పూర్తిస్ధాయిలో టెల్ ఎండు వరకు నీరు అందిచలేని దుస్ధితిలో ఉందని అన్నారు. ప్రధాన కాలువలను రూ. 200 కోట్లతో ఆధునికరిస్తున్నట్లు తెలిపారు. దీని వలన కాలువల నీటి సామర్ధ్యం పెంపొంది అందరికి నీరు అందుతుందని అన్నారు. పూర్తిగా శిధిలావస్తకు చేరిన డివిఎం 86, 83 పరిధిలోని కాలువలను పూడికతీత, జంగల్ క్లియరెన్సు కాలువ లైనింగు పనులను చేయనున్నట్లు తెలిపారు. అందుకు ఎంత ఖర్చయినా వెనుకాడేదిలేదని తెలిపారు. రైతులు కాల్వల నిర్వహణకు సహకరించాలని పిలుపు నిచ్చారు. అవసరమైన చోట పాత చట్టాలను సవరిస్తామని తెలిపారు. దిగువ ఎల్.ఎం.డి.లో 8000 క్యూసెక్కుల నీరు సామర్ధ్యం ఉండాల్సి ఉండగా 3500 క్యూసెక్కుల నీటి సామర్ధ్యం కూడా లేదని తెలిపారు. డివిఎం 83కు 2250 క్యూసెక్కుల నీటి సామర్ధ్యం ఉండగా కేవలం 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలుగుతున్నామని అన్నారు. కాలువల నీటి సామర్ధ్యంను రెట్టింపు చేసుకొనడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించగలమని తెలిపారు. గుండారం రిజర్వాయరు కెపాసిటిని పెంపొందించనున్నట్లు తెలిపారు. పత్తిపాక రిజర్వాయరు నిర్మాణం ద్వారా ఎల్లంపల్లి నీటిని మరలించి, మంధని, హుజురాబాద్ నియోజకవర్గం లో ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలకు నీరును సరఫరా చేయనున్నట్లు తెలిపారు. వచ్చే మూడు సంవత్సరంలో జిల్లాలో కరువును దూరం చేస్తామని అన్నారు. లోయరు మానేరు ద్వారా పెద్దపల్లి, మంధని, హుస్నాబాద్ నియోజక వర్గాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. లోయరు మానేరు పైన చెక్ డ్యాంలను నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.ఎస్.పి. సిఇఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

eatela rajender.     eatela     eatela rajender

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *