
చిరంజీవి 150 వ సినిమా కన్ఫమ్ అయ్యింది. దీనికి ‘కత్తిలాంటోడు’ అనే పేరును చిరంజీవి ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేయించారు. తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాకు ఇది రిమేక్. కత్తి సినిమా కథపై కొందరు కోర్టుకెళ్లడం వివాదాలు ముసురుకోవడంతో ఇన్నాళ్లు దీనిపై చిరంజీవి జాప్యం చేశారు. చిరు చిన్న కూతురు శ్రీజ వివాహం కావడం కూడా ఆలస్యానికి కారణమైంది..
కాగా చిరంజీవి 150 వ సినిమా ‘కత్తిలాంటోడు’ సినిమాకు చిరు భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరిస్తారు. చిరు కుమారుడు రామ్ చరణ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. కాగా ఈ సినిమాను శ్రీజ పెళ్లిలో చిరంజీవి అనౌన్స్ చేశారు. అభిమానులకు ప్రత్యేకంగా ఇచ్చిన విందులో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారట.. అనంతరం రక్త దానం చేసిన చిరు అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా షీల్డ్ లు అందజేసి సన్మానించారు.