చిరు ఒప్పుకుంటే 300కోట్లతో మరో మగధీర తీస్తా..

చిరంజీవి ఒప్పుకోవాలే కానీ 200 కోట్లు ఏంటీ..? మూడు వందల కోట్లతో సినిమా తీస్తానన్నారు నిర్మాత చిరంజీవి బావమరిది అల్లు అరవింద్.. రాంచరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అరవింద్ ను యాంకర్ సుమ ఓ ప్రశ్న అడిగింది. రాంచరణ్ తో 200 కోట్లు పెట్టి మగధీర తీశారు.. మరి బావ చిరంజీవితో 200 కోట్లు పెట్టి మరో మగధీర తీయరా అని ప్రశ్నించారు.

దీనికి స్పందించిన అల్లు అరవింద్.. చిరంజీవి గారు ఒప్పుకొని కాల్షీట్లు ఇస్తే 200కోట్లు ఏంటి 300 కోట్లు పెట్టి సినిమా తీస్తామని.. ఆయన స్టామినాకు ఇంకే ఎక్కువే పెట్టిన తిరిగి వస్తాయని అల్లు చెప్పారు. చిరంజీవితో తాను 151 వ సినిమా తీస్తున్నానని.. దానికి చిరు ఒప్పుకున్నారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *