చిరుధాన్యాల సాగు రైతులను ప్రోత్సహించాలి

ప్రజలకు ఆరోగ్యపరంగా మేలుచేసే చిరుధాన్యాల సాగు విస్తీర్నాన్ని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ సి.పార్ధసారధి తెలిపారు.

బుధవారం సచివాలయంలో ఐఐయంఆర్ (భారతీయ చిరుధాన్యాల సంస్ధ) వ్యవస్ధాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడుతూ ఈ నెల 9న సంస్ధ వ్యవస్ధాపన దినోత్సవాన్ని రాజేంద్రనగర్ లోని ఐఐయంఆర్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత అవసరాల కనుగుణంగా ప్రజలు మెచ్చేరీతిలో చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్ధాలను ప్రోత్సహించడంతో పాటు రైతులకు గిట్టుబాటు కలిగించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సమాజంలో వత్తిడి వలన చెక్కర వ్యాధి, హృదయసంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, ఎంతో పోషక విలువలున్న చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్ధాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాభావ ప్రాంతాలైన మహబూబ్ నగర్,మెదక్,ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఈ పంటలు విరివిగా సాగు చేయవచ్చన్నారు. కేంద్రీయ చిరుధాన్యాల సంస్ధతో కలిసి ఎప్రిల్, మే నెలలో నక్లెస్ రోడ్డులో చిరుధాన్యాల మేళాను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. గతంలో చిరుధాన్యాలను విరివిగా వినియోగించేవారని, కాని నేటి యువత జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి రేషన్ దుకాణాలద్వారా అమ్మకాలు, మధ్యాహ్నభోజనం, అంగన్ వాడి కేంద్రాలలో వాడే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. స్వాతంత్ర్యంవచ్చినప్పుడు దేశవ్యాప్తంగా 14 మిలియన్ల హెక్టార్లలో చిరుధాన్యాలను పండించే వారని, ప్రస్తుతం 7 మిలియన్ల హెక్టార్లలో చిరుధాన్యాలను పండిస్తున్నారని అన్నారు. చిరుధ్యాన్యాలు పండించడానికి రైతులలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

డా. విలాస్ ఎ తోనాపి మాట్లాడుతూ చిరుధాన్యాలకు సంబంధించి విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నామని, ఉత్పాదక, రైతుల ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 9న సంస్ధ వ్యవస్ధాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని, చిరుధాన్యాలతో సంబంధం ఉన్న రైతులు,వ్యాపారులు, సంస్ధలను ప్రోత్సహించటానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నామన్నారు. చిరుధాన్యాలతో తయారైన స్టాల్స్, కేఫ్ లను ప్రారంభిస్తున్నామన్నారు. వ్యాపార పరంగా ఎగుమతులు చేయటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.

ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీ యస్.యస్ రావు, మాట్లాడుతూ గతంలో జొన్నలను ఇంటి అవసరాలకు మాత్రమే పండించేవారని, ఆరోగ్యపరంగా ఉన్న డిమాండ్ ఆధారంగా ప్రస్తుతం జొన్నలను పండిస్తున్నారని అన్నారు. వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 న రాజేంద్రనగర్ లో 35నుండి 40 మంది వ్యాపారవేత్తలతో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులను సత్కరించి ప్రొత్సహించడం జరుగుతుంద ని ఆయన తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *