Breaking News

చిరంజీవి రిటైర్ మెంట్ వైజాగ్ లోనేనట..

Chiranjeevi-Dynamic-Entry-At-Sarrainodu-Pre-Release-Audio-Celebrations

చిరంజీవి సినిమాల నుంచి రిటైర్ అయ్యాక ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేసుకున్నాడు. తాను సముద్ర తీరం ప్రాంతమైన వైజాగ్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని రిటైర్ మెంట్ అనంతరం జీవితం గడుపుతానని సెలవిచ్చాడు.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సరైనోడు చిత్రం ఆడియో వేడుక విశాఖ సముద్ర తీరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి హాజరై మాట్లాడారు.. వైజాగ్ తో నాకు ప్రతేక అనుబంధం ఉందన్నారు చిరు.. రాంచరణ్, బన్నీ ఇద్దరు తనకు ఒకేటనన్నారు..

విశాఖ లో నా సినిమాలు రికార్డులు సృష్టించాయని.. ఇక్కడ ప్రజల ప్రేమ వెలకట్టలేనిదని అన్నారాయట.. అల్లు అర్జున్ ను డాడీ సినిమాలో తానే అరంగేట్రం చేయించానని తెలిపారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రతిభావంతుడని.. సరైనోడు కథ వినిపించాక ఇక మారుమాట చెప్పలేదన్నారు. ఈ కథ బన్నీకి అద్భుతంగా సూట్ అవుతుందని చెప్పానని చెప్పారు..

సరైనోడు ఆడియో వేడుక వీడియో పైన లింక్ లో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *