
బర్త్ డే బాయ్ పూరి జగన్నాథ్ బర్త్ డే ఈరోజు.. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. చిరంజీవి 150వ సినిమాపై తనను అవమానించారని.. సెంకడాఫ్ పై తనకు ఏమాత్రం స్పందన తెలియజేయకుండా నచ్చలేదని మీడియాకు లీక్ చేసి తనను అవమానించారని విమర్శించారు. ఫస్ట్ హాఫ్ అందరికీ నచ్చిందని.. కానీ సెంకడాఫ్ మాత్రం చిరు తనకు ఏం చెప్పలేదని.. తరువాత మాట్లాడుదామని తెలిపారన్నారు. కానీ మీడియలో సెంకడాఫ్ బాలేదని చెప్పడం తనను కలిచివేసిందన్నారు. బాగా లేదంటే తానే వేరే కథను సిద్ధం చేసి ఇస్తానన్నాడు. కానీ ఇలా మీడియా ముఖంగా తన స్టోరీ నచ్చలేదనడంతో తాను కలత చెందానన్నారు.
అందుకే చిరంజీవి 150వ సినిమా ఆలస్యం అవుతోందన్నారు. తాను ఆ సినిమాకు డైరెక్టర్ అవునో కాదో ఇప్పుడు చెప్పలేనని చెప్పారు.
డైరెక్టర్ పూరి మాటలు పైన వీడియోలో..