
తెలుగు పాపులర్ చానల్ మాటీవీ గతకొన్ని నెలల క్రితం స్టార్ ఇండియా గ్రూపుకు అమ్మిన సంగతి తెలిసింది.. ఆ అమ్మకం విలువ 2500 కోట్లు.. ఇప్పుడు ఆ మాటీవీ మొత్తం స్టార్ టీవీ పరమైంది.. మాటీవీ, మా మ్యూజిక్, మా గోల్డ్, మా మూవీస్ లు ను టేకోవర్ చేసుకున్నట్టు స్టార్ యాజమాన్యం చేసిన దరఖాస్తును ఎఫ్ ఐపీబీ భారత చానాళ్ల, యాజమాన్యం సంస్త గుర్తించింది..
కాగా మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ కు 60 శాతం.. నాగార్జునకు 10 శాతం.. చిరంజీవికి 20శాతం వాటా ఉంది. ఈ లెక్కన నాగార్జునకు 250 కోట్లు, చిరంజీవికి 500 కోట్లు దక్కనున్నాయి.