Breaking News

చిరంజీవికి ముంబైలో ఆపరేషన్

declare-hyderabad-permanent-joint-capital-of-ap-and-telangana-chiranjeevi_0408130551382

మెగాస్టార్ చిరంజీవికి ముంబైలో ఇవాళ ఆపరేషన్ జరగబోతోంది.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో భుజానికి ఆయన శస్త్ర చికిత్స చేయించుకోనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. చాలా కాలంగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారని.. కత్తి సినిమా షూటింగ్ కు ముందే ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. చాలా రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నా కుదరలేదని చిరంజీవి సన్నిహితులు తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ ఆయన వెంట ఉన్నారు. ఆపరేషన్ తరువాత రెండు వారాలు విశ్రాంతి తీసుకునే ఆయన ఆ తరువాత కత్తి రిమేక్ లో పాల్గొంటారు.. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *