Breaking News

చిన్న ముల్కనూర్ ను ముంచేసిన కేసీఆర్

Revanth-Reddy

కరీంనగర్ : సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మూల్కనూర్ కు అన్యాయం చేశారని టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలు ఇళ్లు కట్టించే కేసీఆర్ దత్తత గ్రామంలో 200 ఇళ్లు ఎందుకు కట్టించడం లేదని విమర్శించారు.

టీడీపీ జిల్లా అధ్యక్షులు విజయరమణారావు, కరీంనగర్ టీడీపీ నేతలతో కలిసి ఆయన చిన్న ముల్కనూర్ లో పర్యటించారు. బాధితుల కష్టాలను కళ్లారా చూశారు. కేసీఆర్ పై మండిపడ్డారు.

అనంతరం మానేరు ముంపు గ్రామాల  ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేములవాడ మండలం సంకేపల్లి వద్ద నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని రేవంత్ రెడ్డి సందర్శించి వారితో కలిసి రోడ్డు రాస్తారోకో సహపంక్తి భోజనాలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *