చిన్న ఉద్యోగమైనా కేజ్రీవాల్ నెరవేర్చాడు..

429835-arvind-kejriwal-rohith-vemula

రోహిత్ వేముల.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా చాలా మంది నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీని ఢిల్లీ సీఎం నెరవేర్చాడు. రోహిత్ సోదరుడు రాజాకు ఢిల్లీలో గ్రూప్ 4 స్థాయి ఉద్యోగం ఇచ్చాడు..

కాగా రోహిత్ సోదరుడు రాజా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్ సైతం పాస్ అయ్యాడు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వ్యక్తికి బంట్రోతు ఉద్యోగం ఇవ్వడంపై కేజ్రీవాల్ పై విమర్శలు కురిపిస్తున్నారు ఉద్యమకారులు. ఇచ్చిన ఉద్యోగం రాజా స్థాయికి తగినది కాదని విమర్శిస్తున్నారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రూప్ 3, 4 ఉద్యోగాల్లోనే కారుణ్య నియామకాలు చేపట్టవచ్చని అందుకే అంతకు మించి ఇవ్వలేమని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *