చిన్నారి వైష్ణవి వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయల విరాళం

సిరిసిల్లా: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి మండలం బురుదేశ్ పల్లి గ్రామానికి చెందిన వైష్ణవి(12) వైద్య చికిత్స కోసం సిరిసిల్లా డి.ఎస్.పి దామెర నర్సయ్య ఎన్.ఆర్.ఐ స్ధానిక దాతల ద్వారా సేకరించిన ఒక లక్ష రూపాయలను మంగళవారం నాడు జిల్లా ఎస్.పి.డి. జోయల్ డేవిస్ అందజేశారు. చిన్నారి వైష్ణవి మెదడులో రక్తం గడ్డ కట్టుకుపోవడంతో కాళ్ళు చేతులు పడిపోయి అచేతనంగా ఉంది. కడుబీద కుటుంబానికి చెందిన వైష్ణవి వైద్య చికిత్స కోసం వైద్యులు నాలుగన్నర లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబీకులు దిక్కుతోచక సతమతమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల పత్రికల్లో వార్తా కధనాలకు స్పందించిన డి.ఎన్.పి దామెర నర్సయ్య ఆమె వైద్య ఖర్చులను జమచేసేందుకు ముందుకు వచ్చారు. తొలుత ధర్మపురి సి.ఐ వెంకటరమణ 10వేల రూపాయల ఆర్ధిక సహయాన్ని అందజేయడంతో పాటు దాతల ద్వారా 1.75 లక్షల రూపాయలను దాతల ద్వారా సేకరించి ఇటీవల అందజేసిన విషయం విదితమే. చిన్నారి వైద్యఖర్చుల కోసం జిల్లా పోలీస్ శాఖ తరపున కూడా సహయం అందజేస్తామని జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి సుబ్బరాయుడు, సిరిసిల్లా, ధర్మపురిలకు చెందిన దాతలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *