Breaking News

చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్

చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్

ఘోరం జరిగింది… న్యాయం చేస్తాం
చిన్నారి తల్లిదండ్రులకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

వరంగల్ : చిన్నారిపై దారుణం సంఘటన విషయం అందరినీ కలిసివేసిందని పంచాయతీరాజ్, గ్రామీాభివృద్ధి, మిషన్ భగీరథ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జరిగిన దారుణం పై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కిరాతకుడి చర్యతో మీకు ఘోరమైన అన్యాయం జరిగిందని చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. చట్టపరంగా కరిన చర్యలు తీసుకోవాలని వరంగల్ వన్ పోలీస్ కమిషనర్ రవీందర్ ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

errabelli dayakar rao 1    errabelli dayakar rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *