Breaking News

చిత్ర నిర్మాణ రంగంలోకి నారా రోహిత్

nara rohith

‘బాణం’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా తెరగ్రేటం చేసిన యంగ్ అండ్ డైనమిక్ హీరో నారా రోహిత్. తొలి చిత్రంతోనే డిఫరెంట్ సబ్జెక్ట్ తో సక్సెస్ సాధించి ఆ తర్వాత ‘సోలో, ప్రతినిధి, రౌడీఫెలో’వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ఓ సెపరేట్ స్త్ట్ర్రెల్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ‘పండగలా వచ్చాడు, అసుర’చిత్రాలతో బిజీగా వున్న నారా రోహిత్ చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఇటీవల నూతన దర్శకుడు శ్రీ సతీష్ దేవినేని నారా రోహిత్ ని కలిసి ఓ సబ్జెక్ట్ ని చెప్పటంతో.. ఆకధ నారా రోహిత్ కి చాలా బాగా నచ్చి ఎక్త్సైటింగ్ గా వుండటంతో పాటు, యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ తో సహ అన్ని వర్గాల వారిని అలరించే యూనివర్సల్ అప్పీల్ వున్న సబ్జెక్ట్ కావడంతో ఇటువంటి కధని తనే స్వయంగా నిర్మిస్తే ఆ కధకి పూర్తి న్యాయం చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో ఆరన్ మీడియా పతాకంపై శ్రీ సతీష్ దేవినేని దర్శకత్వంలో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఎప్పటికప్పుడు యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ కొత్తదనం కోసం తపించే నారా రోహిత్ సినిమా నిర్మాణ రంగంలోనూ తనదైన శైలిలో డిఫరెంట్ సినిమాలు నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *