చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన మంత్రి చందూలాల్ 

చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వెబ్ సైట్ ను సచివాలయంలో టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో కలసి ఆవిష్కరించారు.స్టేట్ ఆర్ట్ గ్యాలరీ రూపొందించిన ఈ వెబ్ సైట్ ద్వారా చిత్రకారులు, కళాకారులు ఏర్పాటు చేసే ప్రదర్శనలలు విశ్వ వ్యాప్తం చేసేందుకు ఉపయోగ పడుతుందన్నారు మంత్రి చందూలాల్.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి సందర్శకుల సంఖ్య పెరిగిందన్నారు బుర్రా వెంకటేశం.గత సంవత్సరం లక్ష మంది వరకు చిత్రకారులు, ఆర్టిస్ట్స్  లు స్టేట్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారన్నారు  పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.చిత్రకారులు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ ను ఆర్ట్ గ్యాలరీ వెబ్ సైట్ ద్వారా అమెజాన్, ఓలెక్స్ కంపెనీలతో ఓప్పందం చేసుకోని పెయింటింగ్స్ ను మార్కెట్ చేసుకోనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పర్యాటక కార్యదర్శి  బుర్రా వెంకటేశం. వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమములో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డా. లక్షీ పాల్గోన్నారు.

About The Author

Related posts