చిత్రమయి అర్ట్ గ్యాలరీ పెయింటింగ్ ఎగ్జీబీషన్ ను ప్రారంబించిన బుర్రా వెంకటేశం

చిత్రమయి అర్ట్ గ్యాలరీ పెయింటింగ్ ఎగ్జీబీషన్ ను ప్రారంబించిన బుర్రా వెంకటేశం

చిత్రమయి అర్ట్ గ్యాలరీ 14 వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకోని ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జీబీషన్ ను తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంబించారు. ఈ ఎగ్జీబీషన్ ప్రారంభ కార్యక్రమములో అర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డా. కె లక్ష్మీ పాల్గోన్నారు. 390 మంది ప్రముఖ చిత్రకారులు వేసిన చిత్రాలను ఈ ఎగ్జీబీషన్ లో ప్రధర్శించారు. చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ ప్రారంబించి నేటితో 14 సంవత్సరాలు పూర్తి అయ్యిందన్నారు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం . గత 14 సంవత్సరాలలో చిత్రమయి అర్ట్ గ్యాలరీ  ఎన్నో అర్ట్ క్యాంపులను నిర్వహించి చిత్రకారులను , కళాకారులను ప్రోత్సహించామన్నారు. గత సంవత్సరం 75 వేల మంది కి పైగా చిత్రమయి  అర్ట్ గ్యాలరీ నీ సందర్శించటం జరిగిందన్నారు. ఈ సంవత్సరం సుమారు లక్ష 50 వేల మంది కి పైగా సందర్శకులు వచ్చేలా కార్యక్రమాలను రూపోందిస్తున్నట్లు వెల్లడించారు. చిత్రమయి అర్ట్ గ్యాలరీ  నీ దేశంలో నెంబర్ వన్  అర్ట్ గ్యాలరీ గా రూపోందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక, చారిత్రక, పురాతన కట్టడాల వద్ద ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్దకు వెళ్ళి వారి దుకాణాల పేర్లు ను మంచి అర్ట్ పామింగ్ లో ఉండేలా చిత్రికరించాలని కోరారు. పర్యాటక ప్రదేశాలు పరిసరాలు మంచిగా ఉండటం వల్ల పర్యాటకులు సంఖ్య పెరిగేఅవకాశం ఉందన్నారు. పర్యాటక ప్రదేశాల లో వద్ద మంచి అర్ట్ పామింగ్ ఉండేలా చిత్రికరించిన చిత్రకారులకు చిత్రమయి అర్ట్ గ్యాలరీ తరుపున ప్రోత్సహిస్తామన్నారు. మంచి అర్ట్ వేసిన చిత్రకారులను గుర్తించి ఉత్తమ పెయింటింగ్ కు లక్ష రూపాయల బహూమతి ని అందిస్తామన్నారు. రెండవ బహుమతి 50 వేలు , మూడవ బహుమతి 30 వేల రూపాయలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమములో 390 మంది  ప్రముఖ చిత్రకారులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *