
చిట్టీల పేరు చెప్పి సాగుతున్న దందా సామాన్యుల ను దోపిడీకి గురిచేస్తోంది.. కపిల్ చిట్ ఫండ్ ఈ దారునాలకు వేదికవుతోంది.. కపిల్ చిట్ ఫండ్ లక్ష రూపాయల చిట్టీలు కట్టించుకొని ఎత్తుకున్న లబ్దిదారులకు చుక్కలు చూపిస్తోంది.. లక్ష ఇస్తరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. లక్ష రూపాయల పాటలో పోటీవల్ల ఏ 60 వేల నుంచి 80 వేల మధ్య న కట్ అయిపోతూ ఉంటుంది.. ఆ సొమ్ముకు ముగ్గురి గవర్నరెంటు ఉద్యోగుల ష్యూరిటీలు పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి..
చిట్టీలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు దొరకకపోతే ఇక లక్ష గోవిందా.. లేట్ అయితే 10 వేల వరకు కపిల్ సంస్థ కట్ చేసుకుంటుంది. అష్టకష్టాలు పడి ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ పెట్టుకుంటే అందులోను 1000, 2000 పేర కమీషన్ తీసుకొని ఇస్తుంది..
కపిల్ చిట్ ఫండ్ చేస్తున్న ఆగడాలపై చాలా మంది చాలా రకాలుగా వాపోతున్నారు. లక్షలు ఎత్తుకుంటే చిప్ప చేతికి వస్తోందని.. తమకు డబ్బులు వేసిన యజమానులుగా చూస్తాలేరని.. ఇవ్వకుండా బిచ్చగాళ్లను చేస్తున్నారని అందులో చిట్ వేసిన లబ్దిదారులు వాపోతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ.. కదిలిస్తే కపిల్ దందా వెలుగుచూస్తోంది..
ప్రభుత్వం ఇప్పటికైనా ఈ చిట్టీల దందాలో చేస్తున్న ఆగడాలను అరికట్టాలని వినియోదారులు కోరుతున్నారు.