Breaking News

చిట్టి తల్లి ప్రతిభకు 10లక్షల 16వేల బహుమానం

kcr

సీఎం కేసీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అద్భుత ప్రతిభా పాఠవాలు చూపుతున్న ఖమ్మం పట్టణానికి చెందిన బాలికకు రూ.10 లక్షల 16వేలు ఇచ్చి ఆమెకు సంబ్రమాశ్చార్యాలకు గురిచేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన సుధారాణి -కిరణ్ కుమార్ ల కూతురు 3వ తరగతి చదువుతోంది. చదువులో చాలా చురుకుగా ఉండే బాలిక తెలంగాణ చరిత్ర, కాకతీయ కాలం, శాతవాహనుల యుగం, నిజాం పాలన, స్వాతంత్ర్యం అనంతరం పరిణామాలు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వివక్ష ఇలా ప్రతి చరిత్రాక ఆధారాలను గడగడా చెప్పే నేర్పు సాధించింది. దీంతో ఈమె విషయం తెలుసుకున్న కేసీఆర్ తన ఇంటికి ఆహ్వానించాడు.

kcr23

నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తెలంగాణ 1969 నుంచి ఇప్పటి తెలంగాణ ఉద్యమం, అనంతరం కేసీఆర్ పాలన, పథకాలు, మంత్రుల పేర్లు, సహా మొత్తం గడగడా చెప్పేయడంతో కేసీఆర్ ఆశ్చర్యపోయాడు. ఇంత ప్రతిభాపాఠవాలు ప్రదర్శించిన చిట్టితల్లికి తక్షణం స్పందించి తన వ్యక్తిగత ఖాతానుంచి రూ.10 లక్షల 16వేల బహుమానం అందించాడు. అనంతరం వారికి కడుపునిండా భోజనం పెట్టి బాలికను ఆశీర్వదించాడు. బాగా చదువుకొని పైకి రావాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *