చార్లేట్ తెలంగాణా అసోసియేషన్ సభలలో మంత్రి జగదీష్ రెడ్డి

అమెరికా నార్త్ కరోలినా లోని చార్లేట్ నుండి

చార్లేట్ తెలంగాణా అసోసియేషన్ సభలలో మంత్రి జగదీష్ రెడ్డి

ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత కెసిఆర్ దే …!
28 రాష్ట్రాలకు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రమే రోల్ మోడల్ గా మారింది
17% గ్రోత్ తో రాష్ట్రం ప్రగతిపధంలో ముందుకు దుసుక పోతుంది
రోజు వారీగా వివిధ రాష్ట్రాలనుండి తరలి వస్తున్న ప్రతినిధుల బృందమే ఇందుకు నిదర్శనం
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి స్వీయ సారధ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం
మిషన్ కాకతీయ,మిషన్ భాగిరధలను యావత్ బారతదేశం ఆదర్శంగా తీసుకుంటున్నది
2010 తరువాత తెలంగాణా ఉద్యమంలో కొంత బావోద్వేగం వచ్చిన మాట నిజమే
ప్రపంచానికి తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయాలు ఒక దిక్షుచి
మూడున్నర వేల జాతులలో తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయానికి ప్రత్యేకస్థానం
ఎవరికీ లేని బతుకమ్మ మన సొంతం
ఆమెరికా లోను తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయాలు కాపాడుతున్న తెలంగాణా బిడ్డలు అభినందనీయులు
తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశలకు యన్ ఆర్ ఐ లు తోడ్పటు నందించాలి
మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వృత్తులు మారుతున్నాయి
అన్డుకనుగుణంగా పరిశ్రమలు నేలకోల్పెందుకు ప్రవాసులు ముందుకు రావాలి

-అమెరికా తెలంగాణా అసొసియెషన్ ఉత్సవాలలో మంత్రి జగదీష్ రెడ్డి
-చార్లేట్ తెలంగాణా అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన వనబోజనాలలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
-చేపల వేట తో ప్రత్యెక ఆకర్షణ ప్రవాసుల వెంట సందడి
ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్
మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడి నలుగు సంవత్సరాలే అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనా దక్షతతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం 28
రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు .
అమెరికా తెలంగాణా అసోసియేషన్ అద్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను ఆయన అమెరికా లో
పర్యటిస్తున్నారు .
హ్యుస్టన్ లో జరిగిన ఉత్సవాలలో పాల్గొన్న ఆయన అనంతరం నార్త్ కరోలినా లోని చార్లేట్ వద్ద “చార్లేట్ తెలంగాణా
అసోసియేషన్” అధ్వర్యంలో జరిగిన వనబోజనలా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసులతో కల్సి ఆయన చేపల వేటలో
పాల్గొని ప్రత్యెక ఆకర్షణ గా నిలిచారు.
ఈ సందర్బంగా చార్లేట్ తెలంగాణా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా
రాష్ట్రం ఇప్పుడు 17 %గ్రోత్ తో ప్రగతిపధానదుసుకపోతుందన్నారు. రాష్ట్రంగా ఏర్పడ్డ ఆనతి కాలంలోనే ఇంతటి
అభివృద్ధికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ పడుతున్న శ్రమ అని ఆయన అభివర్ణించారు.
రేపటి తెలంగాణా రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ముఖ్యమంత్రి కెసిఆర్ స్వీయ
సారాద్యంలోనే నిర్మాణం జరుగుతుందన్నారు.
ఆయనే ఒక ఇంజినీర్ గా మారి కాళేశ్వరం వంటి అద్బుతమైన ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన మహాశిల్పి కెసిఆర్ అని
ఆయన కొనియాడారు.
ప్రతి రోజు యావత్ బారతదేశంలోని 28 రాష్ట్రాలనుండి తెలంగాణా లో జరుగుతున్న అభివృద్దిని అద్యయనం
చెయ్యడంతో పాటు వారి వారి రాష్ట్రాలలో అమలు పరిచేందుకు తెలంగాణా రాష్ట్రాన్ని సందర్శిస్తున్న ప్రతినిదుల బృందాల
పర్యటనలె ఇందుకు అద్దం పడుతోందన్నారు.

మిషన్ కాకతీయ ,మిషన్ భగీరధ వంటి పధకాలను యావత్ బారతదేశం మార్గదర్శకంగా ఎంచుకున్న విషయాన్ని
ప్రవాసులు విస్మరించారదాని ఆయన పిలుపునిచ్చారు
ప్రస్తుతం యావత్ ప్రపంచానికి తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయాలు ఒక దిక్షుచిగా మారాయన్నారు.
మూడున్నర వేల జాతులలో తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయానికి ప్రత్యేకస్థానం ఉందని మంత్రి జగదీష్ రెడ్డి
చెప్పుకొచ్చారు.ఎవరికీ లేని బతుకమ్మ మన సొంతం అయినందుకు గర్వపడాలని ఆయన ప్రవాసులకు
ఉద్బోదించారు.ఆమెరికా లోను తెలంగాణా సంస్కృతి,సంప్రాదాయాలు కాపాడుతున్న తెలంగాణా బిడ్డలు
అభినందనీయులు అని ఆయన కొని యాడారు.
తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశలకు యన్ ఆర్ ఐ లు తోడ్పటు నందించాలని ఆయన ప్రవాస తెలంగాణా సంఘాలకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వృత్తులు మారుతున్నాయి అని అందుకనుగుణంగా పరిశ్రమలు
నేలకోల్పెందుకు ప్రవాసులు ముందుకు రావాలి మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు .
ఇంకా ఈ కార్యక్రమంలో రమణ కొట్టే తదితర చార్లేట్ తెలంగాణా అసోసియేషన్ సంఘం బాద్యులు పాల్గొన్నారు .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *