
హైదరాబాద్ , ప్రతినిధి : చలి చంపేస్తోంది. ఎముకల్ని కొరికేస్తోంది.. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనం రోడ్లమీదకు రావడానికి భయపడుతున్నారు. చలిమంటలు వేసుకుంటున్నారు. తెలంగాణ మొత్తం చలి గుప్పిట్లో చిక్కుకుంది. వృద్ధులు చలితీవ్రతకు చనిపోతున్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
ఉత్తర భారతాన్ని చలి గజగజ వణికిస్తోంది. చాలాచోట్ల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలి తీవ్రత తట్టుకోలేక ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో 8 మంది మృతి చెందారు. పొగమంచుతో పలు రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చండీగఢ్ నుంచి విమాన సర్వీసులు రద్దు చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీని చలి గజగజ వణికిస్తోంది. మోదకొండమ్మ పాదల దగ్గర అత్యల్పంగా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలి కారణంగా జనం ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.