
ఉత్తరాఖండ్, ప్రతినిధి : చుట్టూ కొండలు..మధ్యలో అద్భుత నిర్మాణం. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనంతో ఏటా వేసవిలో ఖేదర్నాథ్ టెంపుల్ కళకళలాడుతూ వుంటుంది. ఐతే ఈ సీజన్లో మాత్రం అక్కడ అందుకు భిన్నమైన వాతావరణం దర్శనమిస్తుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో చలికాలంలో భారీ మంచు కురుస్తోంది. అది ఏ స్థాయిలో వుంటుందంటే ఆలయం పూర్తిగా మంచుగడ్డలతో కప్పబడి పోయేంతగా ఉంది. అందుకే వేసవిలో మాత్రమే ఇక్కడ భక్తులను అనుమతిస్తారు.
రెండు మాసాలు పట్టే అవకాశం..
ఈ సీజన్లో ఆలయానికి వెళ్లే దారులు మొత్తం మంచుతో పేరుకుపోతాయి. వేసవిలో ఆలయం తెరవాలంటే ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలి. ఆ పనిలో సిబ్బంది ఎప్పుడో నిమగ్నమైపోయారు. పరిస్థితులు ఇంత దారుణంగా వున్నప్పటికీ కొందరు భక్తులు మాత్రం ఆలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరిని అధికారులు వారిస్తున్నారు. పైగా వారి పనులకు విఘాతం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే వుంటే పనులు ముమ్మరం చేస్తున్నారు. మంచు గడ్డలను పూర్తిగా తొలగించేందుకు ఇంకా రెండు మాసాలు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.