
మహ్మద్ షఫీ భార్య నిన్న దిక్కులేకుండా బిడ్డను కని చనిపోయింది.. ఆ బిడ్డను రోడ్డుపై పడేయడంతో భర్త షఫీ ఆమెను తీసుకెళ్లడానికి పడ్డ కష్టాలు పత్రికల్లో రావడంతో చలించిపోయిన మంత్రి హరీష్ రావు షఫీకి ఉద్యోగం ఇచ్చాడు. మహబూబ్ నగర్ లోని నారాయణ పేట మార్కెట్ యార్డులో షఫీకి గుమస్తా ఉద్యోగం కల్పించారు.
భార్య శవం ఓ చేతిలో మరో చేతిలో పురిటి బిడ్డను పట్టుకొని అంత్యక్రియలకు డబ్బులు లేక పడిన బాధలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. దీనిపై హరీష్ మానవత హృదయంతో స్పందించి షఫీకి ఉద్యోగం ఇచ్చాడు. కాగా పసిబిడ్డ ప్రస్తుతం ఐసీడీఎస్ లో చికిత్స పొందుతోంది. బిడ్డ కోలుకోగానే తెచ్చుకొని పెంచుకుంటానని షఫీ తెలిపారు.