Breaking News

చరిత్రలో రాశాను కొత్త అంకం

0012

హైదరాబాద్ : నా జీవిత చరిత్రలోనే ఈరోజు గొప్ప అంకం మొదలైంది. నా లక్ష్యం నెరవేరింది. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని కట్టిచ్చా.. ఈ జీవితానికి ఇది చాలు అన్నారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో వేసిన బీజాన్ని కొనసాగిస్తానన్నారు.

0021

హైదరాబాద్ లో ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. దసరాకు ప్రారంభించుదామనుకున్నా అమరావతి శంకుస్థాపనకు పోయినా.. అందుకే ఇండ్ల ఓపెనింగ్ లేటయ్యిందన్నారు. 396 పేదల కుటుంబాలు సర్వ హంగులతో డబుల్ బెడ్ రూంలో నిర్మించిన ఇండ్లను కేసీఆర్ పాలు పొంగించి వారికి అప్పగించారు. అనంతరం వారితో సామూహిక భోజనాలు చేసి అందరికీ పేరుపేరునా పలకరించారు.

033

డబుల్ బెడ్ రూం ఇండ్లను కేంద్ర మంత్రి వెంకయ్య సైతం మెచ్చుకున్నాడని.. దేశంలోనే ఇంతటి పథకం మరోటి లేదని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *