Breaking News

చనిపోయినా బాగుండేది..

murdar

కేప్ టౌన్ : పాపం యువతి.. చనిపోయినా బాగుండేది.. ఇప్పుడు ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది. ఓ ఉన్మాది దాడిలో కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకున్న యువతి ప్రాణాలతో బయటపడింది.కానీ ఆమె శరీరం మొత్తం అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది. కేవలం కనురెప్పలను మాత్రమే ఆడిస్తోంది. మిగితావేవి శరీరంలో పనిచేయడం లేదు. అసలు జరిగిన విషయం ఏంటంటే..

దక్షిణాఫ్రికా దేశంలోని స్టెల్ బాస్క్ లో నివసిసిస్తున్న మార్లిన్ వాన్ బ్రెడా (25) అనే యువతి తన తల్లిదండ్రులు ఇద్దరు సోదరులతో నివసిస్తోంది. ఓరోజు హఠాత్తుగా ఓ ఆగంతకుడు ఇంట్లోకి గొడ్డలితో ప్రవేశించి కుటుంబ సభ్యులను నరికి చంపేశాడు. మార్లికి కూడా మెడ, తలపై తీవ్రగాయాలై కొన ఊపిరితో ఉంది. ఆస్పత్రికి తరలించగా బతకదని వైద్యులు తేల్చారు. కానీ వారం తర్వాత కోలుకున్న యువతికి కేవలం కనురెప్పలు మాత్రమే ఆడిస్తోంది. మిగతా అవయవాలు పనిచేయడం లేదు. దీంతో తన తల్లిదండ్రులను చంపిన నిందితుడిని పట్టించే ప్రధాన సాక్షిగా మిగిలిపోయింది. కానీ ఆమె బతుకు నరకంగా మారింది. ఆ యువతి కనురెప్పల ఆధారంగానే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు..

కాగా కుటుంబం పై దాడి చేసిన అనంతరం ఓ యువకుడు వారి ఇంటి బయట రక్తపు మరకలతో కనిపించాడని.. ఎవరితో ఫోన్లో మాట్లాడుతుండగా చూశామని చుట్టపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *