
మహారాష్ట్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి : ‘‘అఖండ మహారాష్ట్రను జయించిన చత్రపతి శివాజీ.. సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధానికి వెళ్లేముందు మహారాష్ట్రలోని దుర్గామాత కొలువైన ఫేమస్ దేవాలయం తుల్జాపూర్ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారట.. అప్పడు పూజలు చేయగా అమ్మవారు ఒక గొప్ప కత్తిని బహూకరించిందట.. ఆ కత్తితోనే సమస్త మరాఠీ స్రామాజ్యాన్ని శివాజీ జయించాడని ప్రతీతి..’’ ఇదంతా పవిత్ర మహారాష్ట్రలోని తుల్జాపూర్ దేవాలయం అమ్మవారి కథ.. తిరుపతిలాగా ఎత్తైన కొండల మీద వెలసిన తుల్జాపూర్ దేవాలయం ప్రాచీన ప్రష్యన్, రాజస్తానీ కళాకృతిలో గుట్టలమధ్యన అద్భుతంగా చత్రపతి శివాజీ కట్టించారట… అక్కడ అమ్మవారు శివాజీ కత్తిని ఇచ్చినట్టుగా చిత్రపటాలు, రూపాలు ఉన్నాయి..
ఇక్కడ అభిషేకం వింతగా ఉంటుంది. అరటిపళ్లు, ఒక కుండలో పెరుగు, ఒక ఆకుపచ్చటి చీరతో అమ్మవారి అభిషేకిస్తారు. అమ్మవారిని స్వయంగా గర్భగుడిలో చేతులతో తాకి మొక్కనిస్తారు. అమ్మవారి స్నానాల గది.. అద్భుతంగా ఉంటుంది. హుండీలు బయట గోడకు కట్టి ఉంటాయి. ప్రసాదం అంటూఉండదు.. అమ్మవారికి అభిషేకంగా పోసిన పెరుగులో సగాన్ని ఉంచుకొని దాన్నే ప్రసాదంగా తాగడం ఆనవాయితీ.
మరో వింత ఏంటంటే చుట్టూ ఒక మూడంతస్తుల ఎత్తైన రాతి గోడ ఈ ఆలయం చుట్టూ ఉంది. ఆలయం సమీపంలోనే ఒక పెద్ద సొరంగం ఉంది. ఇక్కడి నుంచి ఆపద వస్తే తప్పించుకునేందుకు చత్రపతి శివాజీ తవ్వించాడట.. గుర్రంతో పారిపోయేంతా జాగా ఉన్న ఈ సొరంగంలోకి కొద్ది దూరంగా మాత్రమే వెళ్లగలం. ముంబై వరకు ఈ సొరంగం తవ్వారని అక్కడున్న పుజారులు చెప్పారు.
చత్రపతి యుద్ధ నీతి పాలన నీతి బాగున్నట్టుగానే ఆలయాలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్కడి గుళ్లు, గోపారాలన్నీ శివాజీ ప్రీతిపాత్రమైన శివుడికి ప్రతిరూపాలకు దగ్గరగా ఉండడం విశేషం..