
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సరిహద్దు మండలం కాల్వ శ్రీరాంపూర్, మంథని నియోజకవర్గాల్లో కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేటకు వచ్చి మావోయిస్టు కేకేడబ్ల్యూ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తల్లి కంకణాల వీరమ్మ ను కుటుంబాన్ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. వీరమ్మకు కొత్త దుస్తులు, పండ్లు, మీఠాయిలు అందజేశారు.మావోయిస్టు నేత రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. లొంగిపోతే రూ.5 లక్షల రివార్డుతో పాటు వ్యవసాయ భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని.. ఎలాంటి కేసులు లేకుండా పునరావాసం కల్పిస్తామని ఎస్పీ వీరమ్మతో చెప్పారు.
అనంతరం జిల్లా సరిహద్దున గల గోదావరి తీరం వెంట పరిశీలించారు. చత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామాల్లో తిరిగారు..