Breaking News

చచ్చాక కూడా ఆత్మ శాంతి లేదు..

14vmdp11

కరీంనగర్, ప్రతినిధి : చావు ఎప్పుడొస్తుందో తెలియదు.. ఎలా వస్తుందో తెలియదు.. ఎన్ని లక్షలు సంపాదించినా.. పోయేటప్పుడు ఏం తీసుకుపోము.. కేవలం ఆరడుగుల నేల … మనల్ని పూల్చడానికైనా.. కాల్చడానికైనా కావాల్సింది అదే.. కానీ ఇప్పడు గజం భూమి లేని పేదల పరిస్థితి ఏంటి? వారి ఇంట చావు వారికి ఎంతటి కష్టాన్ని తెచ్చిపెడుతోంది. అద్దె ఇంట్లో చస్తే.. శవం రోడ్డు మీద ఉండాల్సిందేనా.. ఆ బాధ అనుభవిస్తే కాని తెలియదు.. ఇలాంటి హృదయ విదారక ఘటనే కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన లింగపల్లి రాజమల్లు (50) అనారోగ్యం బారిన పడి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మృతిచెందాడు. రాజమల్లు కు స్వంత ఇళ్లు, స్థలం లేవు.. దీంతో ఎక్కడ దహనం చేయోలో తెలియక కుటుంబ సభ్యులు, బంధువులు హైరానా పడ్డారు.  చివరకు నర్సింగాపూర్ శివారులో బోడగుట్ట సమీపాన చెక్ డ్యాం స్థలంలో మృతదేహాన్ని పూడ్చేందుకు గుంతను తవ్వారు. అయితే విషయం తెలుసుకున్న గ్రానైట్ వ్యాపారులు చెక్ డ్యాం స్థలం తమకు పట్టా భూమి అని అక్కడ పూడ్చితే కేసులు పెడతామని బెదిరించి శవాన్ని అక్కడి నుంచి తీసేయించారు.. చేసేదేమీ లేక బంధువులు స్థానిక ఊరచెరువులో అంత్యక్రియలు  నిర్వహించారు. శవానికి అంత్య్రక్రియల కోసం ఆ కుటుంబం అటూ ఇటూ పరిగెత్తడం అందరినీ కలిచివేసింది.

వీరిదే కాదు చాలా మంది అద్దెకుండేవాళ్లు, పేదలదీ ఇదే పరిస్థితి. ప్రతీవారికంటూ సొంత ఇళ్లు.. పూడ్చడానికి 6 అడుగుల నేల ఇప్పుడు కనీస అవసరం.. లేకపోతే ఇలాంటి ఆకృత్యాలు సమాజంలో ఇంకా చాలా జరిగే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *