Breaking News

‘చంద్రిక’ సెన్సార్‌ పూర్తి!!

chandrika new
ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై.. యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ ‘చంద్రిక’. కార్తీక్‌ జయరామ్‌-కామ్న జెత్మలాని-శ్రీముఖి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ… ‘మా దర్శకుడు యోగేష్‌ ‘చంద్రిక’ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్‌ప్లే, అర్టిస్టుల అభినయం, మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ గున్వంత్‌సేన్‌ రీరికార్డింగ్‌తోపాటు గ్రాఫిక్స్‌ ‘చంద్రిక’ చిత్రానికి ప్రధాన ఆకర్షణుగా నిలుస్తాయి’ అన్నారు.
దర్శకుడు యోగేష్‌ మాట్లాడుతూ… ‘మా నిర్మాత ఆశ మేడమ్‌ , ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు,  సాంకేతిక నిపుణులందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్లే ‘చంద్రిక’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొనేలా రూపొందింది’ అన్నారు.
గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *