చంద్రబాబే కారకుడు?

అమరావతి (పిఎఫ్ ప్రతినిధి): తెలుగు రాష్ర్టాలు విడిపోతే ఏపికి ప్రత్యేక ప్యాకేజీ లాంటి అనేక వరాలు కురిపిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం తీరా సమయానికి చేయిచ్చింది. అయితే ఇదంతటికీ చంద్రబాబే కారణమని పలువురు నేతలు బహిరంగంగానే బాబుపై తమకున్న అక్కసును వెల్లగక్కుతున్నారు. తాజాగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రం నుంచి ప్యాకేజీలను కూడా అడుక్కోవడం రావడం లేదని విమర్శించారు. అంతే కాకుండా బాబుకు ఏపి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అన్నారు. జెపితో పాటు కాంగ్రెస్, వైసిపితో పాటు పలు పార్టీలు బాబు ప్రభుత్వంపై నిరసనల దాడి చేస్తున్నారు. విపక్షాలే కాకుండా సొంత టిడిపి, బిజెపి పార్టీలలో కూడా అసమ్మతి నెలకొంది. ఈ అసమ్మతిని సొంత పార్టీ నేతలు సైతం బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. అయితే ఈ నిరసనలను ఎలాగైనా తిప్పికొట్టాలని టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తమ అసహనాన్ని వెళ్లదీస్తున్నారు. అంతేకాకుండా బస్సు ఛార్జీలు, మద్యం ధరలను పెంచారు. ఒక్క రోజులోనే తీవ్ర స్థాయిలో నిరసనల దాడి తగలడంతో మద్యం ధరలను పెంచినట్టే పెంచి వెనక్కి తగ్గారు కానీ బస్సు ఛార్జీలను అలాగే కొనసాగించి జనాల నెత్తిన మరో భారం వేసి అగ్నికి ఆజ్యం పోశారు చంద్రబాబు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *