
రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు సీఎం కేసీఆర్ జ్వరం పేరు చెప్పి డుమ్మా కొట్టడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. చంద్రబాబును కలవడం.. పరస్పరం చూసుకోవడం ఇష్టం లేకనే కేసీఆర్ ముఖం చాటేశాడనే ప్రచారం జరుగుతోంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అసలు సూత్రధారి కావడం.. ఆయనపై కేసు నమోదుకు చర్యలు తీసుకుంటుండడంతో ఎందుకు వచ్చిన మొహమాటం అనే కేసీఆర్ రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరుకాలేదని టీఆర్ఎస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.