
చూస్తుంటే చంద్రబాబు పాలనపై ఆయన తోటి మిత్రుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారా.? చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. దీనికి ఆజ్యం పోసింది ఏపీ రాజధాని కోసం భూసేకరణ.. కృష్ణ నది ఒడ్డున ఉన్న బేతపూడి, ఉండవల్లి, పెనుమూక లాంటి గ్రామాలు ఎంతో సారవంతమైన పొలాలు కలిగి ఉన్నాయని.. గ్రామాల రైతులు వ్యవసాయంపైనే బతుకు వెళ్లదీస్తున్నారని.. పవన్ ట్విట్టర్ లో స్పందించారు. ఇలాంటి సంవత్సరానికి 3 పంటలు పండే భూములు రాజధానికి అవసరమా చంద్రబాబు ఆలోచించాలని ట్విట్టర్ లో పవన్ కోరారు.
కాగా దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల, మరో మంత్రి రావెల పవన్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ దీనిపై మరో సారి ట్విట్టర్ స్పందించారు. నేను విజ్ఞతతో రైతుల సమస్యలపై స్పందిస్తే అవమానకరంగా మాట్లాడుతారా అని మండిపడ్డారు. త్వరలోనే ఆ మూడు గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకుంటానని ఏపీ లో పర్యటిస్తానని చెప్పారు.
3