
ఢిల్లీ : టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంపై విచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని దీనిపై విచారణ జరపాలని కోరారు. ఎన్టీఏ భాగస్వామి టీడీపీ అవినీతి కేసులో ఇరుక్కుంటే బీజేపీ కి ఆ మరక ఉంటుందని దీనిపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు.
దీనిపై రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే హోంశాఖ నుంచి గవర్నర్ నరసింహన్ కు ముడుపుల వ్యవహారంపై నివేదిక పంపించాల్సింగా కోరారు.