
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు దగ్గర జీతం ఉన్నవాడేనని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ లో సమావేశమైన టీడీపీ బృందం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి తప్ప ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేటీఆర్ గుంటూరు చదువుకున్నాడని.. 375డి చట్టం ప్రకారం తెలంగాణకు మంత్రి అయ్యే అర్హత కేటీఆర్ కు లేదని వివరించారు. కేటీఆర్ కు పేరు మా నాయకుడు ఎన్టీఆర్ పేరే పెట్టుకున్నాడని విమర్శించారు.