
-రిలీజ్ అయ్యింది ట్రైలర్ -సినిమా ముందుంది..-కేసీఆర్
నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ చంద్రబాబు పై దుమ్మెత్తి పోశాడు. చంద్రబాబు చేసింది చాలా ఉందని హింట్ ఇచ్చాడు. బాబు బాగోతం చాలా ఉంది. ఆయన సంగతి ముందు రోజుల్లో చాలా బయటపడతది.. ఇప్పుడే వద్దు.. అని విలేకరులకు చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది..
చంద్రబాబు స్టీఫెన్ తోనే కాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నట్టు సమాచారం. అందుకే కేసీఆర్ ముందుంది ముసళ్ల పండుగ అన్నారు. కాగా చంద్రబాబు కు కూడా బండారం బయటపడడంతో కేంద్రం శరణుజొచ్చాడు. ఎలాగైనా బయటపడేయాలని అర్థించాడు. కేంద్రం కణికరిస్తుందా.. లేదా అనే రాబోయే రోజుల్లో తేలబోతోంది. కాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు కావడం కూడా చంద్రబాబు అరెస్ట్ తప్పదు అనే అర్థం వస్తుంది. కేసీఆర్ ఢిల్లీ వెళితే మోడీ, కేంద్రమంత్రులు సయోధ్య కుదుర్చేవారు. కానీ ఆయన ఢిల్లీ పర్యటన లేదని చెప్పడం చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయినట్టే అని భావిస్తున్నారు విమర్శకులు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని కేసీఆర్ చెప్పటం కొసమెరుపు.