Breaking News

చంద్రబాబు కోసం విజయవాడకు కేసీఆర్

naidu-rao_0_0_0_0_0_0_0_1_0_0

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సతీసమేతంగా విజయవాడకు తరలివెళ్తున్నారు. తన ఫాంహౌస్ లో నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ రెండోసారి విజయవాడకు పయనమవుతున్నారు. సోమవారం కేసీఆర్ బేగం పేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీ క్యాప్టర్ లో విజయవాడ వెళ్లి అక్కడి నుంచి చంద్రబాబు నివాసాని వెళతారు..

చండీయాగానికి ఆహ్వానించేందుకు గాను కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను కూడా ముద్రించారు. వాటిని ఏపీ సీఎంతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ముఖ్య నేతలకు పంచనున్నారు.

అనంతరం కేసీఆర్ విజయవాడ కనక దుర్గకు మొక్కుకున్న మొక్కును తీర్చనున్నారు.తెలంగాణ సిద్ధిస్తే కనక దుర్గ అమ్మవారికి ముక్కుపుడక పెడతానని కేసీఆర్ గంతలో విజయవాడక కనకదుర్గకు మొక్కారు. ఇప్పుడు రాష్ట్రం సిద్దించడంతో మొక్కు చెల్లించనున్నారు. ఒకే దఫాలో ఇటు చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానించడం.. అటు కనకదుర్గకు మొక్కు చెల్లించేలా కేసీఆర్ రేపటి సోమవారం ప్లాన్ చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *