
చంద్రబాబు నిన్న గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. తాను మునుపటి చంద్రబాబును కాదన్నారు. అప్పటి సీఎం ఉద్యోగులపై కఠినంగా ఉండేవాడని..కానీ ఇప్పుడు తాను చూసీ చూడనట్టు ఉంటున్నానని తెలిపారు. మరో మూడు నెలల్లో పాత చంద్రబాబును చూస్తారు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..
అసలు విషయం ఏంటంటే చంద్రబాబును విలేకరులు గుంటూరులో ఎలకలు కొరికి బాబు చనిపోవడంపై ప్రశ్నించారు. దీనిపై ఆయన ‘ఆ డాక్టర్ కు బుద్దిలేదు’ అంటూ మండిపడ్డారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో సైకో ఇంజక్షన్లు చేసి పారిపోవడం వంటి ఘటనలను ఆయన దృష్టికి తెచ్చారు. అప్పుడు సైకోను పట్టుకోవడానికి ఏపీ పోలీసులు భయపడుతున్నారని.. ఇది సిగ్గుచేటన్నారు. సైకోను పట్టుకోకపోవడంపై తాను డీజీపీ నుంచి అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి వాయించానన్నారు. ఏపీ సీఎంగా తాను 24 గంటలు కష్టపడుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇలాంటి ఘటనల వల్ల ఏపీ ప్రభుత్వ పరువు పోతోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో పోలీసులు ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడడని ఆ స్ఫూర్తి ఏపీ పోలీసులకు రావాలని సూచించారట..
కొసమెరుపు :
తెలంగాణ పోలీసులకు సీఎం వందల కోట్లు ఖర్చు చేసి వాహనాలు అత్యాధునిక వసతులు కల్పించారు. జీతాలు పెంచారు. మరి ఈ విషయంలో తమకు ఎందుకు వివక్ష అని చంద్రబాబును పోలీసులు ప్రశ్నించారట..