చంద్రబాబు అంతమాటన్నాడా.. రాజీనామా దిశగా కేంద్ర మంత్రి

N1

ఎప్పుడు అనని నోరు ఓ సమావేశంలో ఆగ్రహంగా నినదించింది. ఏం పనిచేయడం లేదంటూ ప్రశ్నించింది. దీంతో సున్నిత మనస్కుడైన కేంద్ర మంత్రి సీనియర్ టీడీపీ నాయకుడు నొచ్చుకున్నాడు.రాజీనామా చేస్తానంటూ అధినేతకు స్పష్టం చేశాడు.. ఆయనకు సారీ చెప్పిన అధినేత ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దాడు…

సీఎం చంద్రబాబు విజయవాడ లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబుకు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి రాజీనామా చేస్తాననే వరకు వచ్చింది. చంద్రబాబు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో విమానాశ్రయాలు అభివృద్ధి కావడం లేదని .. విమానయాన మంత్రి అయిన అశోక్ గజపతి రాజు నిధులు విడుదల చేయడం లేదని’ పరోక్షంగా విమర్శించారు. దీనిపై నొచ్చుకున్న కేంద్ర మంత్రి ‘ప్రతీ ఫైలును ప్రధానమంత్రి దగ్గరుండి పర్యవేక్షించి కొర్రీలు పెడుతున్నాడని.. తనది స్వతంత్ర శాఖే అయిన ప్రధాని నిర్ణయమే ఫైనల్ అని తాను ,మిగతా కేంద్ర మంత్రులు ఏం చేయలేకపోతున్నారని వాపోయారు. అర్థం చేసుకోకుండా విమర్శించిన చంద్రబాబుతో తనకు పనిచేతకాకపోతే రాజీనామా గంటలో చేస్తానంటూ మనస్తాపంతో ఆవేదన చెందారు. దీంతో చంద్రబాబు అనునయించారు. అశోక్ ఆ తర్వాత ఇఫ్తార్ విందులో, విలేకరుల సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోవడం కొసమెరుపు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *