చంద్రబాబును కేసులో ఇరికించకు..

-రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించిన పయ్యావుల, ధూళిపాల్ల
హైదరాబాద్ : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైలు పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ కేసులో డబ్బులు ఇచ్చింది చంద్రబాబేనని వీడియోల్లో రేవంత్ స్పష్టం చేశాడు. దీంతో ఈ కేసు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా ఉందట..

దీంతో టీడీపీ ఏపీ నేతలను ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. నిన్న రేవంత్ రెడ్డి ఉన్న చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశ్, ధూలిపాళ్ల నరేంద్ర వెళ్లారు. రేవంత్ తో ములాఖత్ అయ్యారు. ఎట్టి పరిస్తితుల్లో ఈ కేసులో ఏసీబీ విచారణలో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు బయటపెట్టవద్దని.. నిన్ను నీ కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు చెప్పమన్నారని చెప్పారట.. ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటేనే నిన్ను సేవ్ చేస్తారని బుజ్జగించారట.. దీంతో ఈ కేసులో రేవంత్ వాగ్మూలం కీలకం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *