చంద్రబాబును కాపాడేందుకు రంగంలోకి కేంద్రమంత్రి

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై చర్లపల్లి జైలులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్రం లో మోడీకి సన్నిహితుడైన చంద్రబాబు ను ఎలాగైనా కేసునుంచి తప్పించేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశారు. పైకి విద్యుత్ సమస్యలపై చర్చించారని చెబుతున్నా అంతర్గత చర్చలు మాత్రం రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు పాత్ర పై చర్చ జరిగింది. ఆయనను కాపాడేందుకు పీయూష్  కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చారని  సమాచారం.

రేవంత్ పట్టుబడ్డ వీడియోల్లో స్పష్టం గా చంద్రబాబే సూత్ర ధారి అన్న విషయం వెలుగుచూసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ సీఎంను కేసులో దోషిగా నిలిపేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తోంది. దీంతో ఏపీ సీఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.తనను కాపాడాలని కేంద్ర సాయం కోరినట్టు సమాచారం. అందులో భాగంగా విద్యుత్ మంత్రి పీయూష్ వచ్చి కేసీఆర్ తో మాట్లాడాడట.. కానీ కేసీఆర్ ఈ విషయంలో తానేమీ చేయలేనని.. ప్రమేయం ఉన్న వారందరూ బోనులో నిలబడాల్సిందేనని స్పష్టం చేశారట.. రాజకీయంగా , మీడియాలో పతాక శీర్షకన వచ్చిన ఈ ఉదంతంపై వెనక్కు తగ్గితే తమ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని తానేమీ సహకరించనని చెప్పారట.. దీంతో ఏపీ సీఎంకు చిక్కులు ఎదురయ్యేలానే ఉన్నాయి.

ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రి పీయూష్ చంద్రబాబుతోనూ చర్చలు జరిపారు. కేసీఆర్ తో చర్చించిన విషయాలను వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *