Breaking News

చంద్రబాబుకు బాంబు పెట్టిన గంగిరెడ్డి దొరికాడు..

15-1447574153-gangi-reddy

ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్, చంద్రబాబుపై బాంబు దాడిలో కీలక నిందితుడు కొల్లం గంగిరెడ్డి ఎట్టకేలకు ఏపీ పోలీసులకు చిక్కాడు. మారిషస్ లో పట్టుపడ్డ గంగిరెడ్డిని ఢిల్లీ తీసుకొచ్చింది ఏపీ సీఐడీ బృందం.. అనంతరం ప్లైట్ లో హైదరాబాద్ కు తరలించారు. దాదాపు 200 కోట్లకుపైగా ఆస్తికి అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి సంపాదించాడు గంగిరెడ్డి.. అంతేకాదు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలిపిరిలో బాంబు దాడిలో సహకరించాడనే ఆరోపణలున్నాయి..

ఇప్పటివరకు గంగిరెడ్డిపై 28 కిపైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలతో చాలా మంది రాజకీయ నేతలతో సంబంధాలున్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చివరకు పోలీసుల చేతికి చిక్కారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *