చంద్రబాబుకు తలనొప్పిగా కేసీఆర్ ‘వరాలు’

హైదరాబాద్, ప్రతినిధి : అధికారంలోకి వచ్చిన కొత్తలో సై అంటే సై అన్న ఏపీ, తెలంగాణ సీఎంలు ఇప్పుడు మానసికంగా ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో టీఆర్ఎస్ ను అభాసుపాలు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. సీఎం కేసీఆర్ అంతే స్పీడుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల సస్పెన్షన్లతో ధీటుగా సమాధానమిచ్చారు.

లోటు బడ్జెట్ తో అప్పుల కోసం ఢిల్లీకి మెట్లెక్కుతున్న ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకొడుతున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అంగన్ వాడీలకు, ప్రజాప్రతినిధులకు, పోలీసులకు ఇలా అడిగిన వారందరిపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ వరాల వెనుక తెలంగాణ ప్రజలపై ప్రేమ కంటే ఏపీ సీఎం పై అక్కసే ఎక్కువ ఉందంటున్నారు టీడీపీ నేతలు..

తెలంగాణలో అంగన్ వాడీలు, ప్రజాప్రతినిదులకు జీతాలు భారీగా పెంచడంతో ఆ ప్రభావం ఏపీలోని అంగన్ వాడీలు, ప్రజాప్రతినిధులపై పడింది . ఇప్పుడు ఏపీ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఏపీ వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీలో చలో అసెంబ్లీకి ముట్టడించారు. మాకు తెలంగాణలో వలే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ అసెంబ్లీలో ఇవాళ వాయిదా తీర్మానం సైతం ఇచ్చి చర్చకు పట్టుబట్టింది. ఇదే కాదు ప్రజాప్రతినిదులు సైతం తమకు జీతాలు పెంచాలని ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉద్యోగుల ఫిట్ మెంట్ సైతం 43 శాతం చంద్రబాబు పెంచినా దాన్ని భరించే శక్తి ఏపీ ప్రభుత్వానికి లేదు. ఈ నేపథ్యంలో అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది చంద్రబాబు పరిస్థితి . ఓ వైపు జీతాలే ఇవ్వలేక కూనరిల్లుతున్న రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పై కేసీఆర్ వరాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ వరాలు ఇచ్చే ఆర్థిక స్థితి లేదు. దీంతో కేసీఆర్ గేమ్ ప్లాన్ కు చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *