
ఏపీ సీఎం చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి.. మోడీ పర్యటన, అమరావతి శంకుస్థాపన తర్వాత చంద్రబాబుకు మరింత ఎక్కువయ్యాయి. మోడీ పర్యటన ముగింసిందో లేదో ఏపీలో బస్సు చార్జీలు, మద్యం రేట్లను పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాయి.. ఈ నిర్ణయం ఇఫ్పుడు ఏపీ లో రాజకీయ వేడిని రగిలిస్తోంది.
ఏపీ కాంగ్రెస్ అయితే ఏపీ నోట్లో మట్టి అంటూ మట్టిని సేకరించి నిరసనగా ప్రధానికి పంపాలని ‘మట్టి సత్యాగ్రహం’ అనే వినూత్నకార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో కాంగ్రెస్ ఏపీ కి ప్రత్యేక హోదాను జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది..
ఇక వైసీపీ బంద్ కు పిలుపునిచ్చింది.. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకుండా మోడీ, చంద్రబాబులు మోసం చేశారని మండిపడ్డారని.. దీనికి నిరసనగానే వరుస ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.