చంద్రగ్రహణంతో ఆలయాలు మూసివేత

ఈ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి చంద్రగ్రహణం శనివారం దర్శనమిచ్చింది. ఇది భారతదేశంలో సంపూర్ణంగా కనిపించే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రలో మాత్రమే.. అరుణాచల్ ప్రదేశ్ లోని తెజు, రోయింగ్ పట్టణాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. ఇక్కడ 4 నిమిషాల 43 సెకన్లపాటు కనిపిస్తుంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే చంద్రగ్రహణం కనపడుతుంది. ఈ గ్రహణం సాయంత్రం 3.45 గంటల నుంచి మొదలయి 5.27 నుంచి 5.32 వరకు సంపూర్ణంగా కనపడుతుంది. అనంతరం పాక్షిక గ్రహణం 7.14 వరకు కనపడుతుంది.

ఆలయాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. నల్గొండ జిల్లా యాద్రాద్రి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వరుడి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయంతో పాటు అన్ని ఆలయాలను మూసివేశారు.  రాత్రి 8 గంటలకు గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ, ఆలయ శుద్ది చేసి ఆలయాలను తెరుస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *